RR: కేశంపేట మండలం నిర్దవెల్లి పరిధిలోని శాంరావు తండా రోడ్డులో ఏర్పడిన గుంతలను మట్టితో తాత్కాలికంగా పూడ్చారు. వర్షాలకు రోడ్డు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో స్థానిక నేతలు ఈ చర్యలు చేపట్టారు. అయితే తాత్కాలిక మరమ్మతులతో ప్రయోజనం లేదని, శాశ్వతంగా బీటీ రోడ్డు నిర్మించాలని తండావాసులు కోరుతున్నారు.
తెలంగాణ
మరమ్మతులు వద్దు.. బీటీ రోడ్డు కావాలి


