హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలి'

NLG: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతు సంఘాలు, రాజకీయ పార్టీల సూచనలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ నల్గొండలో ఆయన మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ప్రస్తుత పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని కోరారు.