హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 6న జైనూర్‌లో ఉచిత వైద్య శిబిరం

ASF: వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జైనూర్ పీహెచ్‌సీలో ఈ నెల 6న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు వెల్లడించారు. శిబిరంలో ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థోపెడిక్ నిపుణులు వైద్య పరీక్షలు చేయనున్నారు. జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్(యూ) మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.