హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి’

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలనకు తీర్మానాలు చేశారు. రామకృష్ణ కాలనీ, కొత్తపల్లిల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ యాదవ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 ప్రకారం బాల్య పెళ్లిళ్లు నేరమన్నారు. బాల్య వివాహాల సమాచారాన్ని 1098 హెల్ప్‌లైన్‌‌కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.