హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షణ కంచె లేకుండా ట్రాన్స్‌ఫార్మర్‌

NRML: నర్సాపూర్ మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరం సమీప 14వ వార్డులో విద్యుత్ అధికారులు 63 కేవీ నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. అయితే చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయలేదు. వర్షాకాలం కావడంతో అటుగా వెళ్లే వారికి ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.