హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్ అభివృద్ధికి నిధుల మంజూరు..!

WNP: ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్‌టీ హాస్టల్‌ను సాయి చరణ్ రెడ్డి సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో డైనింగ్ హాల్, స్లీపింగ్ హాల్‌తో పాటు ఇతర అభివృద్ధి పనులకు రూ. 3 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ నిధులతో పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.