హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో పడి వ్యక్తి మృతి

JN: నర్మెట్ట మండలం హన్మంతాపూర్ గ్రామానికి చెందిన శనిగరం మల్లేశ్(58) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. గ్రామంలో ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేసుకునే మల్లేశ్ శుక్రవారం సాయంత్రం చేపలు పట్టేందుకు ఊరచెరువుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. శనివారం మృతదేహం నీటిపై తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.