MLG: ములుగు పట్టణ శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద పురుషుల మరుగుదొడ్లకు తాళం వేయడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మేడారం జాతర సమయంలో తెరిచిన వాటిని జాతర ముగియగానే మూసివేశారు. ఆలయానికి నిత్యం భక్తులు వస్తుండటంతో అత్యవసర సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు తాళాలు తొలగించి మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
గట్టమ్మ ఆలయానికి భక్తుల తాకిడి.. మరుగుదొడ్లు మాత్రం బంద్!


