హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరా లేక రైతుల తిప్పలు

KMR: తాండూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని వెంకంపల్లి ఫీడర్‌కు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో వ్యవసాయ మోటార్లు పనిచేయడం లేదని రైతులు వాపోతున్నారు. గత వారం రోజులుగా వ్యవసాయానికి సుమారు నాలుగు గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.