హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప నుంచి లక్నవరం వరకు జలధార..!

MLG: రామప్ప చెరువు నుంచి మరో చెరువుకు జలాలను తరలించే చర్యలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే గణపసముద్రం, పాకాల, ధర్మసాగర్ చెరువులకు నీటిని అందిస్తుండగా, తాజాగా పర్యాటక కేంద్రమైన లక్నవరం చెరువుకు కూడా నీటిని తరలించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 87 ఎకరాల్లో గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయినట్లు సమాచారం. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.