కరీంనగర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే మైదానంలో EKAM ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను పరిశీలించారు. స్థానిక ప్రతిభావంతులు, వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసుకునేందుకు ఈ ప్రదర్శన చక్కటి వేదిక అన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు.
తెలంగాణ
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల


