హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్పాలతో ముస్తాబైన కాణిపాకం ఆలయం

CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించనున్న పుష్ప పల్లకి సేవకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్ప పల్లకి సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.