హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటర్ నమోదు

MBNR: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా 3వ వార్డులో పట్టభద్రులకు ఓటర్ నమోదు దరఖాస్తులు పంపిణీ చేశారు. మాజీ వార్డు కౌన్సిలర్ సతీష్, నాయకుడు రమేష్ పట్టభద్రులను కలిసి దరఖాస్తులు అందజేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తూ, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.