JGL: సారంగపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ చంద్రశేఖర్‌పై పల్లెపు రాజు అనే వ్యక్తి కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో చంద్రశేఖర్‌కు గాయాలు కావడంతో 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సబ్ స్టేషన్ పరిసరాల్లో చెత్త వేయడం, బహిర్భూమికి వెళ్లడంపై మందలించినందుకు దాడి చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్సై గీత కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌పై దాడి.. కేసు నమోదు


