హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యా కమిటీ ఎన్నికలలో ఉద్రిక్తత

ప్రకాశం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీసాయి. శనివారం ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇరు వర్గాలు రాళ్ల దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎన్నికలు విభేదాలతో వాయిదా పడ్డాయి.