BHNG: ఆలేరు మున్సిపాలిటీ 1వ వార్డులో పాత మున్సిపల్ కార్యాలయం నుంచి దొంతిరి ఫంక్షన్ హాల్ వరకు రహదారి ఇరువైపులా పేరుకుపోయిన మట్టి, ఇసుకను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. పనులను కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ పరిశీలించారు. వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా శుభ్రం చేసినట్లు తెలిపారు. వార్డును క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చడమే ధ్యేయమన్నారు.
తెలంగాణ
'క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుస్తాం'


