హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాల్ వద్ద భారీ రద్దీ.. వాహనదారుల అవస్థలు

NRML: నిర్మల్‌లో మరో నూతన మాల్ ప్రారంభం కావడంతో కొనుగోలుదారుల సందడి విపరీతంగా పెరిగింది. ప్రధాన రహదారి ఆనుకునే ఉన్న ఈ మాల్స్‌కు కొనుగోలుదారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్కింగ్ కూడా లేకపోవడంతోనే పరిస్థితులు ఈ విధంగా దాపురిస్తున్నాయని తెలిపారు.