హైదరాబాద్: 28°C
తెలంగాణ

నష్టపరిహారం కోసం 3వ రోజు రిలే దీక్ష

KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో కొత్తపల్లి–హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్న బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరింది. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వని పక్షంలో మండల కేంద్రానికి బైపాస్ రహదారి ఏర్పాటు చేయాలని కోరారు.