AKP: రాంబిల్లి మండలంలో లారస్ ఫార్మా కంపెనీ కోసం నిర్వాసిత రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వ్యతిరేకించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్. శంకరరావు, మండల కార్యదర్శి జి. దేముడు నాయుడు, మండల కమిటీ సభ్యులు ధోని కాశి, ఎర్రిపల్లి రాములను రాంబిల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు


