హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరకట్ట పరిరక్షణకు ఆదివాసీ వేదిక డిమాండ్

BDK: గోదావరి కరకట్టను ఇసుక తవ్వకాల నుంచి కాపాడాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ముంపు ముప్పు నుంచి చర్ల మండల ప్రజలను రక్షించేందుకు కరకట్ట పటిష్టతపై తనిఖీలు చేపట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.