ADB: తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ నాయకులు, అధికారుల కుమ్మక్కై అర్హులకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో సమావేశమై మాట్లాడారు. కూలీ పని చేసుకునే బడుగు, బలహీన వర్గాలకు రావాల్సిన ఇళ్లను డబ్బున్న వారికి, సొంత ఇళ్లు ఉన్నవారికి కేటాయించారని వాపోయారు. కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
'ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై కలెక్టర్ స్పందించాలి'


