హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయితో కొట్టి తమ్ముడిని హత్య చేసిన అన్న

కృష్ణా: ఘంటసాల మండలం దేవరకోటలో తమ్ముడిని అన్న రాయితో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మద్యం సేవించి రోడ్డుపై ఉన్న తమ్ముడు రాజ్‌కుమార్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు అన్న విజయ్‌కుమార్ ప్రయత్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో రాయితో తలపై కొట్టడంతో రాజ్‌కుమార్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.