AP: YCPకి రాజీనామా చేసిన నెల్లిమర్ల మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు.. YCP అధినేత జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఓ నియంత అని అభివర్ణించారు. ఆ పార్టీ ఓ లిమిటెడ్ కంపెనీ అని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక చర్యలు, జగన్ అతివిశ్వాసం వల్లే వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని విమర్శించారు. జగన్‌ను నమ్మి వేలాది కుటుంబాలు నాశనమయ్యాయని ఆరోపించారు.
వార్తలు
జగన్ ఓ నియంత: అప్పలనాయుడు


