JGL: గొల్లపల్లి మండలం చెందోళి గ్రామంలో తరచూ విద్యుత్ కోతలు, తక్కువ ఓల్టేజీ సమస్యలను నిరసిస్తూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మంత్రి నియోజకవర్గంలోనే ఉన్న గ్రామంలో విద్యుత్ సమస్యలు కొనసాగడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ సమస్యలపై గ్రామస్థుల ధర్నా


