ASF: బెజ్జూర్ మండల కేంద్రం అంగన్వాడీ సెంటర్-1, 2, సలుగుపల్లి సెంటర్-1, పోతపల్లి కేంద్రాల్లో ఆయాలు లేక అంగన్వాడీ టీచర్లే ఆయాల విధులు నిర్వహిస్తున్నారు. ఆయాలు పదవీ విరమణ చేసినా వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో అదనపు పనిభారం పడుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలుగా మారిన టీచర్లు


