ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ నియామక పరీక్షల కోసం నిర్వహిస్తున్న ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ నెల రోజుల్లో 30 శాతం కోర్సు పూర్తయిందని SP నితిక పంత్ శనివారం తెలిపారు. కోచింగ్ సెంటర్ సందర్శించి ప్రవేశ పరీక్ష ద్వారా 157 మందిని ఎంపిక చేసి నిపుణులతో రాత, ఫిజికల్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 20 నాటికి శిక్షణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'నెల రోజుల్లో 30 శాతం కోర్సు శిక్షణ పూర్తయింది'


