కోనసీమ: అమలాపురం గ్రంథాలయంలో గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రూ.10 వేల విలువైన పుస్తకాలను అమలాపురం సీఐ పి.వీరబాబు బహూకరించారు. గ్రంథాలయాధికారి జీ.వీ.ఆర్.ఎస్.హెచ్.కె. వర్మ విజ్ఞప్తికి స్పందించిన సీఐ ఈ పుస్తకాలను అక్టోబర్ 3న గ్రంథాలయాన్ని సందర్శించి అందజేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల కోసం రూ.10 వేల విలువైన పుస్తకాల బహూకరణ


