HNK: కమలాపూర్ మండల కేంద్రంలో ‘ఊరి కోసం ఒక్కరోజు శ్రమదానం’ కార్యక్రమంలో భాగంగా శనివారం 14వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఏఎంసీ ఛైర్‌పర్సన్ ఝాన్సీ రవీందర్ ఆధ్వర్యంలో మురుగు కాల్వలు, రోడ్లను శుభ్రం చేశారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పబ్బు సతీశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఊరి కోసం ఒక్కరోజు’ శ్రమదానం' కార్యక్రమం


