హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్దిలేటి స్వామి క్షేత్ర ఉప కమిషనర్‌కు స్వచ్ఛాంధ్ర అవార్డు

NDL: బేతంచెర్ల శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్ర ఉప కమిషనర్ ఎం. రామాంజనేయులుకు ‘స్వచ్ఛాంధ్ర’ అవార్డు లభించింది. కలెక్టరేట్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. క్షేత్ర పరిధిలో స్వచ్ఛత, పరిశుభ్రతను మెరుగ్గా నిర్వహించినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.