హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళిత సర్పంచ్‌పై దాడి.. ఏసీపీ విచారణ

JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురంలో దళిత మహిళా సర్పంచ్ యాదమ్మపై జరిగిన దాడి ఘటనపై ఏసీపీ భీం శర్మ శనివారం విచారణ చేపట్టారు. గ్రామ సభ తీర్మానం మేరకు మద్యనిషేధం అమలు చేస్తుండగా మద్యం విక్రయాలను అడ్డుకున్నందుకు ఓర్సు తిరుపతి బంధువులు కులం పేరుతో దూషిస్తూ తనపై దాడి చేశారని సర్పంచ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.