హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరులు కురిపిస్తున్న ధాన్యం ధర

NZB: కొత్తపల్లిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. సన్నవడ్లు, డీపీటీ రకం పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యాపారులు పంట పొలాల వద్దకే వస్తున్నారు. క్వింటాకు రూ.3,200 నుంచి రూ.3,500 వరకు ధర చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పచ్చి ధాన్యానికి మెరుగైన ధర లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.