హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థుల ర్యాలీ

ASF: జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బెజ్జూరు ZPHS విద్యార్ధులతో అటవీశాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. 'పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, సేవ్ ద ఫారెస్ట్.. సేవ్ ద నేచర్' అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇంఛార్జ్ FRO శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రకృతి సంపదను భావితరాలకు అందించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.