ASR: ముంచంగిపుట్టు మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కించోళ్ల గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామం నుంచి పర్రెడ జంక్షన్ వరకు కిలోమీటర్ రోడ్డు నిర్మించాలని, అలాగే మధ్యలో ఉన్న కొండవాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి సౌకర్యం లేక గ్రామస్తుల ఇబ్బందులు


