హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుల్లో 30% నీళ్లుంటేనే చేప పిల్లల పెంపకం!

VKB: వర్షాభావంతో ఈసారి చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగానే ఉచిత చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. కనీసం 30 శాతం నీటిమట్టం ఉన్న 201 జలాశయాలను అధికారులు గుర్తించారు. జిల్లాలో 1.29 కోట్ల చేప పిల్లలను వదలడమే లక్ష్యంగా బొచ్చె, రవ్వ, బంగారు తీగ రకాల పంపిణీకి రెండో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించనున్నారు.