హైదరాబాద్: 28°C
తెలంగాణ

KMCలో FRS అటెండెన్స్ విధానం అమలు

KMM: ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల హాజరు నమోదు కోసం అధికారులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల హాజరు నమోదులో మరింత పారదర్శకత, సమయపాలన తీసుకురావడానికి KMC-FRS అటెండెన్స్ విధానాన్ని శనివారం ప్రారంభించారు. ఇందులో ప్రతి ఉద్యోగి ఏ సమయానికి విధులకు హాజరయ్యారు, ఏ సమయానికి విధులు ముగించి వెళ్లారు అనే వివరాలు నమోదు కానుంది.