W.G: పాలకోడేరు మండలం శృంగవృక్షం మేజర్ పంచాయతీలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు శనివారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


