హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త లారీ ఢీకొని వ్యక్తి మృతి

తూ.గో: రాజమండ్రి ఆర్యాపురం వద్ద శనివారం మున్సిపల్ చెత్త లారీ ఢీకొని వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న దంపతులను వెనకనుంచి వేగంగా వచ్చిన కార్పొరేషన్ వాహనం ఢీకొట్టిందని పేర్కొన్నారు. తీవ్ర గాయంతో భర్త అక్కడికక్కడే కన్నుమూయగా, భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. కళ్లెదుటే భర్త చనిపోవడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది.