హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టీకాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి'

JGL: జగిత్యాల పట్టణంలోని 45వ వార్డు మార్కెట్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన UIP సెషన్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సెషన్ నిర్వహణ తీరును పరిశీలించి, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న టీకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీకాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.