హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేలుడు ఘటనపై ఎంపీ గురుమూర్తి దిగ్భ్రాంతి

TPT: శ్రీసిటీ టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అత్యున్నత వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అవసరమైన సహాయాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.