NTR: నందిగామ పురపాలక పరిధిలోని 17వ వార్డు, ముఖ్యంగా 6వ రోడ్డులో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా వృద్ధులు, మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పాములు, దోమల బెడదతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సచివాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో వెలగని వీధి దీపాలు


