హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

ELR: స్వచ్ఛతా హి సేవలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కాలువలు, డ్రైన్ల వద్ద శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. నీటిలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను సిబ్బంది తొలగించారు. ప్రజలు నీటి వనరుల్లో చెత్త వేయరాదని, తడి, పొడి వ్యర్థాలను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికే ఇవ్వాలని కమిషనర్ కె.వెంకటరమణ సూచించారు.