హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాముల వారి నిత్య కళ్యాణం

KMM: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శనివారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా సాగింది. అర్చకులు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ఆలయం రామనామ స్మరణతో మార్మోగింది.