హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలకు ఏర్పాట్లు

ADB: ఈనెల 4న ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జెడ్పీ సీఈవో తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరున్న సభ్యులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటు వేయవచ్చు. సభ్యత్వ కార్డు లేదా ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు కార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.