హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోకలిబండతో భార్యను బాది చంపిన భర్త

GDWL: ధరూర్ మండలం ఓబులోనిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జమ్ములమ్మ అనే మహిళను ఆమె భర్త గోపి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవే ఈ హత్యకు కారణమా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.