ప్రకాశం: ఒంగోలు జయప్రకాశ్ కాలనీలో నివాసముంటున్న ట్రాన్స్ జెండర్ నవ్యరెడ్డిపై శనివారం రాజు అనే వ్యక్తి దాడి చేసినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా విభేదాలు రావడంతో నవ్యరెడ్డి అతడికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటి వద్దకు వెళ్లిన రాజు దాడి చేసినట్లు సమాచారం. గాయపడిన నవ్యరెడ్డిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో ట్రాన్స్ జెండర్ పై దాడి


