CTR: బైరెడ్డిపల్లి మండలానికి స్వచ్ఛాంధ్ర అవార్డు లభించింది. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు చేతులమీదుగా బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయచందర్ అవార్డును అందుకున్నారు. జిల్లాలోని వివిధ మండలాలు, శాఖలకు మొత్తం 64 అవార్డులు అందజేశారు. బైరెడ్డిపల్లి మండలానికి అవార్డు రావడం గర్వకారణమని స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బైరెడ్డిపల్లి మండలానికి స్వచ్ఛాంధ్ర అవార్డు


