హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లి అమ్మకాలను ప్రారంభించిన MLA

VSP: మధురవాడ రైతు బజార్‌లో రాయితీ ఉల్లి అమ్మకాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. రైతు బజార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, తదితరులు పాల్గొన్నారు.