BPT: రామాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కొండూరి నాగరాజు అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన పార్థివదేహానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకుడి భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళులు


