హైదరాబాద్: 28°C
క్రీడలు

గోల్ఫ్‌లో భారత్‌కు రెండు పతకాలు

ఆసియా క్రీడల్లో భాగంగా శనివారం  గోల్ఫ్‌ పోటీల్లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. గోల్ఫ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం రాగా, గోల్ఫ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం దక్కింది. వ్యక్తిగత విభాగంలో ప్రణవి స్వర్ణం గెలిచి తొలి గోల్ఫర్‌గా రికార్డు సాధించారు. టీమ్‌ ఈవెంట్‌లో భారత మహిళా జట్టు రజతం చేజిక్కించుకుంది.