హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణ సస్పెండ్!

TPT: గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే పలు దేవాలయాలకు ఈవోగా విధులు నిర్వహిస్తున్న ముసునూరి రవికృష్ణపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. అతడిపై వచ్చిన అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూడూరు పట్టణంలోని శ్రీ శివాలయం, ధర్మరాజస్వామి దేవస్థానం ఈవోగా రవికృష్ణ పని చేస్తున్నారు.